calender_icon.png 22 February, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం

21-02-2025 07:05:27 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామంలో స్వర్ణ నది ఒడ్డున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందాంబాల ఆలయ వార్షికోత్సవం ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే వేడుకల్లో భాగంగా మొదటి రోజు నిర్వహించిన పూజా యజ్ఞం కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యజ్ఞోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త మురళీధర్ రెడ్డి, నాయకులు ధర్మాజీ రాజేందర్, కృష్ణ ప్రసాద్ రెడ్డి, మల్లేష్, పూజారి పవన్ శర్మ, స్థానిక నాయకులు రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.