calender_icon.png 18 March, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుల పండువగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి 22వ వార్షికోత్సవ వేడుకలు..

17-03-2025 10:34:47 PM

ఘనంగా చివరి రోజు సంబరాలు..

వైరా (విజయక్రాంతి): శ్రీ మహాలక్ష్మి అమ్మవారి 22వ వార్షికోత్సవ వేడుకలు గత మూడు రోజులుగా వైభవంగా కన్నుల పండుగ జరిగాయి. వేలాది మంది భక్తులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు సైతం అమ్మవారిని దర్శించుకొని వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో హాజరై  అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ సాంప్రదాయం నడుమ అర్చకులు బొడ్డుపల్లి వాసుదేవశాస్త్రి ఆధ్వర్యంలో రామకృష్ణ శర్మ పూజారి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బండారు తిరుపతిరావు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వార్షికోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం ఆలయం నుండి వైరా పురవీధుల్లో మహాలక్ష్మి అమ్మవారిని ఊరేగిస్తూ నిర్వహించారు.