calender_icon.png 20 April, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు

04-04-2025 12:52:29 AM

కొల్చారం, మార్చి 3: కొల్చారం మండలం  కస్తూర్బా గాంధీ బాలికా  విద్యాలయంలో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాధికారి రాధా కిషన్ కు  విద్యార్థులు,  ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్షికోత్సవం సందర్భంగా   విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అనేక రకాల సాంస్కృతిక, వైజ్ఞానిక వంటి కార్యక్రమాలతో విద్యార్థులో ఒత్తిడిని తగ్గించి మానసికంగా ఉత్తేజపరిచి పదవ తరగతి పరీక్షలు పూర్తయిన వారు ఉన్నత చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టి రాబోవు రోజుల్లో వారికి బంగారు బాటలు కావాలని ఆకాంక్షించారు.

తాసిల్దార్ గఫర్ మియా మాట్లాడుతూ పాఠశాల  వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని విద్యార్థులు కూడా అంతే స్థాయిలో ఉత్సాహంగా ఉన్నారని ప్రశంసించారు. మండల విద్యాధికారి సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం  పాఠశాలలో యాన్యువల్ డే కార్యక్రమం ఉంటుందన్నారు. కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ మాట్లాడుతూ ఈ మధ్యన వెలువడిన గ్రూప్స్ ఫలితాలలో ఎక్కువ శాతం అమ్మాయిలే ఉత్తమ ఫలితాలను  సాధించి ఉన్నతమైన ఉద్యోగాలలో స్థానం పొందారని తెలిపారు.

ప్రత్యేక అధికారి ధరణి కుమారి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్య ఉన్నత శిఖరాల వైపు ప్రయాణింపచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు  వినోద, లక్ష్మి, లింగమణి, స్వప్న, రాణి,  రిణ కుమారి, రాజ్యలక్ష్మి మాధవి, స్వప్న, ధనలక్ష్మి, జయశీల, సుష్మా, చంద్రకళ, సీఆర్పీలు సంపత్, రాజ్ కుమార్, బోధనేతర సిబ్బంది సాలి, బిజీ, బుజ్జి, రేణుక, దేవి పాల్గొన్నారు.