calender_icon.png 26 March, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్షికోత్సవమా?

26-03-2025 01:00:37 AM

  1. ఫిరాయింపులపై నిర్ణయానికి తగిన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేవరకా!
  2. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలం?
  3. పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
  4. విచారణ ఏప్రిల్ 2కు వాయిదా

న్యూఢిల్లీ, మార్చి 25: పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిం దా అని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాది సుంద రం వాదనలు వినిపించారు.

గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్‌ను ప్రస్తావిస్తూ.. పార్టీ ఫిరా యించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసినా స్పీకర్ స్పందిం చలేదని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఒకరు కాంగ్రెస్ తరఫున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని, అయినా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని న్యాయవాది తెలిపారు.

ఈ విష యాలపై తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ వేసినట్టు గుర్తుచేశారు. నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. తగి న సమయం అంటే ఎమ్మెల్యేల పదవీ కాలం ముగిసేవరకా? అని ధర్మాసనం ప్రశ్నించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వలేదని, ఈ విషయంపై ధర్మాసనం వ్యాఖ్యలు చేసిన తర్వాతే ఇచ్చారని న్యాయవాది సుందరం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చారని కానీ నోటీసులు ఎటు వెళ్లాయో తెలియద ని న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. తాము ఫిర్యాదు చేసి సంవత్సర మైనా స్పీకర్ ఇంకా షెడ్యూల్ చేయలేదని చెప్పారు. ఈసమయంలో సుప్రీం జడ్జి గవాయ్ కలుగజేసుకుని పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయ్యిం దా? అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని గవాయ్ ధర్మాస నం తెలిపింది.

ఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా చెప్పలేదని, అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పుల ను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది. స్పీకర్ క్వాసీ జ్యూడిషియరీ అధి కారాలతో ఉన్నారని, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అన్నారు.

అది జర గడం లేదని భావిస్తే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించడానికి రాజ్యాంగం అవకాశం కల్పించిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమ యం కావాలని కోరిన ప్రతివాదులైన ఎమ్మెల్యేలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

తమ దగ్గర డిలే ట్యాక్టిక్స్ అమలు చేయవద్దంటూ మండిపడింది. తదుపరి విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల్లో ప్రతివాదిగా ఉన్న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తాను పార్టీ మారలేదంటూ కౌంటర్ దాఖలు చేయడం గమనార్హం.