28-03-2025 12:00:00 AM
తుంగతుర్తి, మార్చి 27 : తుంగతుర్తి మండల కేంద్రంలోని జూనియర్ కోర్టు సివిల్ ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారి వంగాల నాగరాజు ఆధ్వర్యంలో గురువారం బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు.
ఈ మేరకు అధ్యక్షులుగా అన్నెపర్తి జ్ఞానసుందర్, ఉపాధ్యక్షులుగా కారింగుల వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీగా ఎండి.పర్వీన్, స్పోరట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా రాజారాం, ఈసీ మెంబర్ గా బానోతు ప్రతాప్, కోశాధికారిగా బానోతు సతీష్ లు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన అన్నెపర్తి జ్ఞానసుందర్ మాట్లాడుతూ కోర్టు భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని, న్యాయవాదులకు ఇంటి స్థలాలతో పాటు సబ్ కోర్టు నిర్మాణం కోసం పోరాడతానని, అదేవిధంగా గ్రామాల్లో న్యాయ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడతామని, ఈ ప్రాంతంలో కోర్టు నిర్మాణం స్థలం కోసం ఎంతో పోరాటం చేశానని, ఆ పోరాటంతో దాదాపు 3 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి కేటాయించడం జరిగిందని, ఆ స్థలంలోనే పక్కా ప్రభుత్వ భవన నిర్మాణంతో పాటు కక్షిదారులకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని పేర్కొన్నారు