calender_icon.png 23 April, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘ నూతన అధ్యక్షులుగా అన్నెం శ్రీనివాస్ రెడ్డి

22-04-2025 06:49:05 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘ సమావేశం దేవాలయ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్(Telangana Non-Gazetted Officers Association) వారి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు ఏ శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు అమరవాది శేష గోపాలచార్యులు, కార్యదర్శి ఎం రవి కుమార్ శర్మ, ఉప కార్యదర్శి పి రామభద్రాచార్యులు, కోశాధికారి టి రాకేష్, ఉప కోశాధికారి కే విష్ణువర్ధనాచార్యులను ఎన్నుకున్నారు.

కార్యవర్గ సభ్యులుగా ఎల్ సాయిబాబా, ఎం నంద, ఎంవి లక్ష్మణరావు, కే సతీష్ ఎస్ చెమ్మరాజు లను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు గా వి.శ్రావణ్ కుమార్, జి మురళీ కృష్ణమాచార్యులు, కే రామస్వరూప రాఘవాచార్యులు, వీ రవీంద్రనాథ్, ఎస్ బి రామకృష్ణారావులను ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా  కె. ఈ. స్థల సాయి, అమరవాది గోపాలకృష్ణమాచార్యులు, అమరవాది విజయ రాఘవన్, కే శ్రీనివాసరావు పర్యవేక్షకులు ఎస్ టి జి ఏ కృష్ణమాచార్యుల లను ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు అన్నెం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... దేవాలయ ఉద్యోగుల సంక్షేమం హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు.