calender_icon.png 18 October, 2024 | 2:07 PM

గ్రంధాలయ చైర్మన్ గా అన్నయ్య గౌడ్ నియామకం

18-10-2024 11:41:03 AM

పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సుల్తానాబాద్ మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్ ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ లైబ్రరీస్ వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్నయ్య గౌడ్  గతంలో సుల్తానాబాద్ మేజర్ గ్రామ సర్పంచ్ గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా  పని చేశారు. తన పై నమ్మకం తో తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు కు, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్  లకు అన్నయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో గ్రంధాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి, ఎమ్మెల్యేల సహకారంతో గ్రామీణ ప్రాంతాలలో గ్రంథాలయాలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.