calender_icon.png 3 October, 2024 | 8:58 PM

ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక!

03-10-2024 05:28:12 PM

నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అన్నారం యువకుడు

వికారాబాద్,(విజయక్రాంతి): సర్కార్ కొలువు సాధించాలనేది ఎందరికో కల. డిగ్రీ పట్టాలు చేతికి వచ్చినప్పటి నుంచి కోచింగ్‌లు తీసుకుంటూ యువత ఉద్యోగ సాధనలో ముగినిపోతుంటారు. ఎంత కష్టపడినా.. కొలువు కొందరినే వరిస్తుంది. అయితే తాజాగా రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. కొడంగల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ S/O వెంకటయ్య నిరుపేద కుటుంబంలో పుట్టిన యువకుడు సెప్టెంబర్ 30న వెలువడిన డీఎస్సీ ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలో సోషల్ స్టడీస్ లో  2వ ర్యాంక్, వికారాబాద్ జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించి తన సత్తా చాటాడు. అలాగే గురుకుల ఫలితాలలో టీజీటీ, పీజీటీలు, హెచ్డబ్ల్యూఒ(హస్టల్ వర్డెన్) జోన్ 6లో 17 ర్యాంక్ సాధించాడు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైన చాలు అనుకునే ఈ రోజుల్లో 4 ప్రభుత్వ ఉద్యోగాలు వెనువెంటనే సాధించి నేటి తరం యువకులకు ఆధర్శంగా నిలిచాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.