calender_icon.png 8 April, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న ఈవోగా అన్నపూర్ణ

08-04-2025 12:00:00 AM

 చేర్యాల, ఏప్రిల్ 7 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి నూతన కార్య నిర్వహణ అధికారిగా ఎస్ అన్నపూర్ణ సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ ఇన్చార్జి ఈవోగా పనిచేసిన కే రామాంజనేయులు యధా స్థానంలో కొన సాగనున్నారు.  అన్నపూర్ణ అసిస్టెంట్ కమిషనర్ హోదాతో చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్యనిర్వాహణ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమెకే కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు ఆమె ముందుగా మల్లికార్జున స్వామిని దర్శించుకుని, గర్భాలయంలో ప్రత్యేక పూజ లు జరిపారు. అనంతరం కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఆమె వెంట ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్ రెడ్డి లు ఉన్నారు. ఆదివారం రోజున దేవాదాయ శాఖ అదన కమిషనర్ కే జ్యోతి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. తెల్లారే  కార్యనిర్వాహణ అధికారి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం   చర్చనీయ అంశంగా మారింది.