calender_icon.png 16 January, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నపూర్ణ స్టూడియోస్‌కి 50 ఏళ్లు

16-01-2025 01:48:44 AM

టాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ స్టూడియోస్‌లో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోను ఏర్పాటు చేసి 50 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగర్జున ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగనాడు ఈ స్టూడియో ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. కనీసం రోడ్లు కూడా లేని సమయంలో తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు దీనిని ఎలా స్థాపించారో తనకు ఇప్పటికీ అర్థం కాదన్నారు.

“రోడ్లు కూడా లేని సమయంలో నాన్నగారు హైదరాబాద్‌కి వచ్చి అన్నపూర్ణ స్టూడియోను ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. దీని నుంచి ఎంతో మంది టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్టులు, కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారు. ఎంతో మందికి ఉపాధి కల్పించింది. సంక్రాంతి నాడు ఈ స్టూడియో ప్రారంభమైంది. ప్రతి సంక్రాంతికి ఇక్కడకు వచ్చి అందరితో కలిసి టిఫిన్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ముందు కూడా కొనసాగుతుంది” అని నాగార్జున తెలిపారు.