calender_icon.png 15 January, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నపూరణి ఈజ్ బ్యాక్, కానీ..

08-08-2024 02:32:49 AM

‘అన్నపూరణి’.. సీనియర్ హీరోయిన్ నయనతార నటించిన 75వ చిత్రం. ‘ది గాడెడ్ ఆఫ్ ఫుడ్’ అనేది ఉపశీర్షిక. నీలేశ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయన్‌దే ప్రధాన పాత్ర. గత ఏడాది చివరలో విడుదలైంది. తర్వాత ఈ ఏడాది జనవరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. నయనతారతోపాటు చిత్రబృందంపై ముంబయి, మధ్యప్రదేశ్, జబల్‌పూర్‌లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల విషయంలో అప్పట్లో వివాదం తలెత్తడమే ఇందుకు కారణం. దీంతో అప్పుడు ఓటీటీ నుంచి తొలగించాల్సి వచ్చిందీ సినిమాను.

ఈ నేపథ్యంలో మత విశ్వాసాలను దెబ్బ తీసే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చిన నయన్, చిత్ర నిర్మాణ సంస్థ.. సినిమా ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. ఇదిలా ఉండగా, సుమారు ఏడు నెలల తర్వాత ఇప్పుడీ సినిమా మళ్లీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది. ఇదే నెల 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ సింప్లీ సౌత్ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. “అన్నపూరణి’ ఈజ్ బ్యాక్. భారతదేశాన్నిన మినహాయించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ఆగస్టు 9 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది” అని రాసుకొచ్చింది సదరు ఓటీటీ సంస్థ. అయితే, ఇక్కడ రిలీజ్ చేయకపోవడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.