calender_icon.png 4 March, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహ వార్షికోత్సవ సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నప్రసాద వితరణ..

03-03-2025 05:11:45 PM

మునగాల: మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో నరసింహపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ రమాదేవి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా అన్నవితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ... ఇలా మా వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్నవితరణ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, తమ ఇంట్లో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు కనీసం ఒకరోజైనా వారి కడుపు నింపటం పరిపాటిగా మారిందన్నారు.

ఇలాంటి కార్యక్రమాలు ఆశ్రమంలో నిర్వహించుకోవడం మానసిక ప్రశాంతత లభిస్తుందని, గత కొంతకాలంగా ఇలాంటి కార్యక్రమాల సందర్భంగా, వారితో కలిసి పంచుకోవడం, వారి కళ్ళల్లో ఆనందం చూడటం, వారి దీవెనలు ఆశీర్వాదాలు పొందడం చాలా సంతృప్తిగా ఉంటుందని, ఇలా నిరాధారణకు గురై ఎవరు లేని అనాధలకు ప్రతి ఒక్కరు ఇలా స్పందించి, వారి కుటుంబాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా కనీసం ఒక రోజైనా వారికి మంచి ఆహారాన్ని అందించి అండగా నిలవాలని, సంపాదనలో కొంత ఇలాంటి పుణ్యకార్యాలకు సహకరించాలని మానవసేవే మాధవసేవ అన్న పదానికి సార్ధకత చేయాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వేమూరి సత్యనారాయణ రమాదేవి దంపతులు, బీఈడీవారి బంధువులు నరేష్, గోపి ఆశ్రమం నిర్వాహకులు నాగిరెడ్డి విజయమ్మ, కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.