27-03-2025 12:00:00 AM
ముషీరాబాద్, మార్చి 26: (విజయక్రాంతి): 522వ అన్నమాచార్య ఆరాధన ఉత్సవాలను గురువారం ట్యాంక్బండ్ పై గల అన్నమయ్య విగ్రహం వద్ద అన్నమాచార్య భావనవాహిని సంస్థ వ్యవస్థాపకు రాలు పద్మశ్రీ డాక్టర్ శోభరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శోభ రాజు వారి శిష్యులు వెంకటేశ్వర స్వామి వేషాదరణ తో సందీప్, అన్నమయ్య వేషాధారణలో అభిరామ్‌లు భక్తులను ఆకట్టుకున్నారు. వెంకటేశ్వర స్వామి అన్నమ య్య చిత్రపటాలతో, నాదస్వరంతో వేద పండితుల సహకారంతో చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ట్యాం క్బండ్ వద్దనున్న అన్నమాచార్య విగ్రహం వరకు చేరుకొని సుమారు గంటపాటు మ హా నగర సంకీర్తన పేరుమీద ‘హరి యువతర మీతడు, దినము ద్వాదశి నేడు, తాళ్లపాక అన్నమాచార్య, చిత్తము కొలది మరీ చెలి భాగ్యము‘ అనే అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు.
కీబోర్డుపై రాజు అజయ్ తబలాపై వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పండిట్ కాశీనాథ్ మిశ్రా, శ్రీ రామ యోగిజీలు హాజరై మాధవ నామమే శరణం అని సందేశం ఇచ్చారు. కల్కి అవతారం హరి నామం విశిష్టతను వివరించారు. రానున్న వైపరీత్యాలకు కలి మలానికి విరుగుడు మందు కేవలం మాధవ నామమే అని తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి అన్నమయ్యల కు హారతి అందించి అల్పాహార ప్రసాద వితరణ చేశారు. కార్యక్ర మంలో సంస్థ ప్రతినిధులు రమణ తోపాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.