05-04-2025 07:12:59 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని గ్రామీణ బస్టాండ్ ఆవరణలో శనివారం జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో పేదలకు 327వ సారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుల్లపల్లి స్వప్న ఐదవ వర్ధంతి సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవాసమితి అధ్యక్షులు ఆడెపు సతీష్, కార్యనిర్వాహక అధ్యక్షులు కె .విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు కట్టకిషన్, సాయి కృష్ణ, అన్నదాత కుటుంబీకులు గుల్లపల్లి అక్షిత్ చంద్ర, విశ్వక్ తేజ తదితరులు పాల్గొన్నారు.