calender_icon.png 21 December, 2024 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజి యూత్ ఆధ్వర్యంలో అన్నదానం

09-10-2024 06:43:13 PM

మెదక్ (విజయక్రాంతి): చేగుంట పట్టణంలోని చందాయిపేట్ గ్రామంలో శివాజి యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం వద్ద దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద నేడు అమ్మవారి ప్రాంగణంలో సరస్వతి దేవి రూపంలో ఉన్న అమ్మవారికి గ్రామ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమ పూజ కార్యక్రమం, చండీ యాగం నిర్వహించారు. పూజ అనంతరం నిర్వహించిన అన్న సంతర్పణకు హాజరై భక్తులకు అన్న ప్రసాదం అందించడం జరిగింది. అమ్మవారి కుంకుమ పూజ, చండీయాగంలో అత్యధిక మహిళ భక్తులు పాల్గొన్నారు.