హుజూరాబాద్ (విజయక్రాంతి): పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ ప్రతాప తిరుమల్ రెడ్డి కుమారుడు శ్రీచరణ్ (రిక్కి) జన్మదినం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, తిరుమల్ రెడ్డి స్నేహితులు రిక్కికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. రిక్కి జన్మదినం సందర్భంగా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో సుమారు 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్బంగా పలువురు రిక్కిని అభినందిస్తూ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని సామాజిక కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప రాజు, ప్రతాప శ్రీనివాస్, వేణు, సుధాకర్, మనోహర్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.