07-04-2025 05:56:49 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాలచెట్టు ఏరియాలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో హనుమాన్ మాలధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పట్టణానికి చెందిన చెప్పాల రమేష్-జ్యోతి దంపతుల 31వ పెళ్లి రోజు సందర్బంగా హనుమాన్ స్వాములకు అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకముందు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కృష్ణకాంత్ ఆచార్యులు, హనుమాన్ స్వాములు భక్తులు పాల్గొన్నారు.