calender_icon.png 14 November, 2024 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదానం

09-11-2024 01:33:05 AM

కార్యక్రమాన్ని నిర్వహించిన టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేని(ముజీబ్) ఆధ్వర్యంలో ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో కేక్ కట్ చేసి, సుమారు వెయ్యి మందికి అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆయురా రోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అద్యక్షుడు మారం జగదీశ్వర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి సంచాలకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.