calender_icon.png 16 January, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదానం

11-07-2024 02:23:34 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): టీఎన్జీవోస్ యూనియన్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌ఎం హుసేని ముజీబ్ 52వ జన్మదిన వేడుకలను ఆ సంఘం కేంద్ర కార్యాలయంలో టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆధ్వర్యం లో బుధవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదానం చేశారు. హజ్త్ యూసుఫ్ బాబా దర్గాలో చాదర్ సమర్పించి అన్నదానం చేశారు. డాన్‌బాస్కో అనాథాశ్రమంలో సరుకు లు పంపిణీ చేశారు. టీఎన్జీవో సంఘం కార్య దర్శి కే విక్రమ్‌కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యు లు, వివిధ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. కేఆర్ రాజ్‌కుమార్, బాల్‌రాజ్, ఉమర్‌ఖాన్, కే శ్రీనివాస్, నరేష్‌కుమార్, ఖలీద్‌అహ్మద్, వైదీక్‌శాస్త్ర, శ్రీధర్, సుజాత, గీత, ప్రభాకర్, జానకి, పర్వతాలు, కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.