23-03-2025 06:19:48 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని గ్రామీణ బస్టాండ్ వద్ద జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం 322వ సారి సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ... అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని తెలిపారు. దాతల సహకారంతో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13, 2021న ప్రారంబించడం జరిగిందని, దాతల సహకారంతో ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆదివారం 322వ సారి దాతల కోరిక మేరకు పెద్దనపల్లి, రైల్వే స్టేషన్ కి చెందిన దాత పొట్ట నాగమణి-శేఖర్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 180 మందికి అన్నదానం చేసినట్లు చెప్పారు. ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. జనహిత సేవా సంస్థకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొట్ట నాగమణి-శేఖర్ దంపతులు, జనహిత సేవా సమితి గౌరవ సలహాదారులు సేవా రత్న మురుకూరి బాలాజీ, కందుల రాజన్న, కార్యవర్గ సభ్యులు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.