27-02-2025 10:04:41 PM
ఇల్లెందు/టేకులపల్లి,(విజయక్రాంతి): ఇల్లెందు పట్టణంలోని శ్రీ ఉమా గణపతి శివాలయం(Sri Uma Ganapathi Shiva Temple)లో మహాశివరాత్రి సందర్బంగా మహా అన్నప్రసాదం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. పట్టణంలోని 18వ వార్డు గాంధీ చౌక్ సమీపంలో గల శ్రీ ఉమా గణపతి శివాలయంలో మహా శివరాత్రి(Maha Shivratri) పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రాత్రి 12 గంటలకు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా గురువారం ఆలయంలో ఉదయం ఐదు గంటల నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు, రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు యెలుగూరి మధుబాబు, చందా చక్రధర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు నుంచి శ్రీ ఉమా గణపతి శివాలయంలో శివ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నమన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అన్ని విధాలుగా సహాయ,సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఈరోజు మహా అన్నప్రసాద కార్యక్రమంలో సుమారు 3000 వేల మంది భక్తులు స్వామి వారి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గందె సురేష్, రామిడి శంకర్, నూక ఆనందరావు, సుగ్గల మహేష్,కె. భాస్కర్, గణేష్ బుక్ స్టాల్ సుబ్బారావు, యెలుగూరి మనోజ్, ముఖ్య అతిధులు ఆర్యవైశ్య మహాసభ సభ్యులు ప్రొద్దుటూరి నాగేశ్వరరావు, అర్వపల్లి రాధాకృష్ణ, నరేంద్రుల అను, కండె రమేష్, వ్యామసాని జనార్దన్ రావు, యెలుగూరి నగేష్ కుమార్, సైఫా రాజశేఖర్, తాటిపల్లి సుబ్బారావు, పుల్లూరు సతీష్, భోనగిరి రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. టేకులపల్లి మండలం బోడు గ్రామంలోని గణపతి దేవాలయంలో బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణం నిర్వహించి, భక్తులు జాగారం చేశారు. గురువారం దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహిచారు.