03-03-2025 01:35:44 AM
బాన్సువాడ, మార్చి 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలో గత ఏడు రోజుల నుండి అఖండ హరినామ సంకీర్తనలు భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ భజన కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులు అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.