calender_icon.png 1 February, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమం

01-02-2025 01:36:02 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (విజయక్రాంతి):  అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కేంద్ర సంఘ ప్రధాన కార్య  డాక్టర్ సయ్యద్ మాజిదుల్లా హుస్సేనీ (ముజీబ్) గారి ఆధ్వర్యంలో ఎంఎన్‌జే క్యా  ఆస్పత్రి, నిలోఫర్ ఆస్పత్రి మరియు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఆవరణలో సుమారు 3వేల నిరుపేద రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో అసద్ అన్వర్ ట్రస్ట్ కోశాధికారి సయ్యద్ అసదుద్దీన్, హైదరాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు కురాడి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఖాలీద్ అహ్మద్, ప్రచార కార్యదర్శి వైదిక్ శాస్త్ర, సభ్యులు ముఖీమ్ ఖురేషి, శ్రీధర్ నాయుడు, నాల్గవ తరగతి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఖాదర్ బిన్ హాసన్, సభ్యులు.. ముహమ్మద్ అతీక్ పాషా, ఈఎస్‌ఐ రాజు, ఏపీఆర్‌ఓ మొహమ్మద్ వహీద్, ముస్తఫా షరీఫ్, ఎమ్‌ఎన్‌జే చంద్రశేఖర్, జోయెల్, ఐటీఐ సత్యనారాయణ, మిత్రులు..

సయ్యద్ జమాల్ జహంగీర్, సయ్యద్ ముహమ్మద్ కామ్రాన్, సయ్యద్ అబ్దుల్ ఖాదర్, ఉస్మాన్ అలీ ఉస్మాని, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ.. కీర్తిశేషులైన తమ తల్లిదండ్రుల పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, కుటుంబ సభ్యులు, మిత్రుల మరియు తోటి ప్రభుత్వ ఉద్యోగుల ప్రోత్సాహంతో కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.