calender_icon.png 25 October, 2024 | 4:57 AM

అన్నా, చెల్లి.. ఆస్తి గొడవ

25-10-2024 02:31:22 AM

  1. వైఎస్ కుటుంబంలో తారస్థాయికి విభేదాలు
  2. ఆస్తుల్లో వాటా ఇవ్వడం లేదంటూ రచ్చకెక్కన షర్మిల

అమరావతి, అక్టోబర్ 24: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరాయి. అన్నాచెల్లెళ్ల మధ్య ఇప్పుడు లేఖల యుద్ధం నడుస్తోంది. ఇవి కాస్తా బయటకు పొక్కడంతో ఇంటి వివాదం రచ్చకెక్కింది.

ఈ మేరకు తన సోదరుడు జగన్‌కు రాసిన లేఖలో.. షర్మిల పలు విషయాలు ప్రస్తావించారు. ఇద్దరి మధ్య 2019లో ఆస్తుల పంపకాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. మొత్తం 13 ఆస్తుల పంపకాలకు ఇరువురు అంగీకరించారు. తదనంతరం 2021 జూలై 26న మరో గిఫ్ట్ డీడ్ రాసుకున్నారు.

ఎంవోయూ  మేరకు సరస్వతీ పవర్‌లోని షేర్లు మొత్తం వెంటనే షర్మి లకు బదలాయిస్తానని జగన్ హామీ ఇచ్చా రు. అయితే వాటిని ఇప్పటికీ తన పేరిట బదిలీ చేయలేదని షర్మిల వాపోయారు. దీనికితోడు భారతి, సండూర్ షేర్లపై కూడా వివాదం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు.

జగన్ లేఖపై అభ్యంతరాలు ఉన్నాయన్న షర్మిల

‘డియర్ జగన్ అన్నా.. మీరు నాకు పంపి న లేఖపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. వైఎస్సార్ గారు కుటుంబ వనరుల ద్వారా సం పాదించిన ఆస్తులన్నింటనీ నలుగురు మనవళ్లు, వనవరాళ్లకు సమానంగా పంచాలని చెప్పిన విషయం గుర్తుచేస్తున్నా. ఈ షరతుకి అంగీకరిస్తున్నాని అప్పట్లో మీరు హామీ ఇచ్చారు.

నాన్న మరణం అనంతరం దానికి ఒప్పుకోనంటూ నిరాకరించారు. నాకు అరకొర ఆస్తులు మాత్రమే ఇచ్చేలా 2019లో చేసుకున్న ఎంవోయూనూ మీరు పట్టించుకోకపోవడం బాధాకరం’ అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.