మునగాల: మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన నల్లూరి లక్ష్మయ్య మూడవ వర్ధంతి సందర్భంగా కుమారుడు నల్లూరి రవి ఆశ్రమంలో ఉన్న అనాధలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ... ఇలా మా నాన్న వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆడంబరాలకు పోయి అనవసరమైన ఖర్చులు పెట్టే బదులు ఇలా నిరాధారణకు గురైన వారికి ఇలాంటి వర్ధంతులు పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇలాంటి ఆశ్రమంలో ఉన్న వృద్ధుల మధ్య జరుపుకోవడం వల్ల వారికి మంచి ఆహారాన్ని అందించిన వారమవుతామని అదే విధంగా వారికి కూడా మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.
ఇంకా, ఈ కార్యక్రమంలో నల్లూరి రవి సునీత దంపతులు, పిల్లలు గణేష్, నిఖిత, లక్ష్మయ్య, కూతురు పంగుళూరి, రాధ, ప్రసాద్ దంపతులు, ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.