calender_icon.png 26 October, 2024 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్న గార్డియన్ మాత్రమే

26-10-2024 12:42:56 AM

  1. ఆస్తులను నాన్న ఎవరికీ పంచలేదు
  2. నలుగురు మనవళ్లు, మనువరాళ్లకు సమాన వాటా
  3. జగన్ ఎవరి కొంగు చాటున ఉండి ఇదంతా చేస్తున్నారు?
  4. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం లేదు
  5. వైఎస్సార్ అభిమానులకు షర్మిల మూడు పేజీల లేఖ

* ‘2019లో ఏపీ సీఎంగా జగన్ అయిన వెంటనే విడిపోదాం అని ప్రతిపాదన పెట్టా రు. ఇందుకు అమ్మ, నేనే ఒప్పుకోలేదు.ఆ తరువాత విజయవాడ వచ్చాక ఆస్తిని ఇష్టం లేకున్నా బలవంతంగా పంచారు. దీని ప్రకా రం సాక్షిలో 40 శాతం, భారతి సిమెంట్స్‌లో 40 శాతం, సరస్వతి పవర్‌లో 100 శాతం, యలహంక ప్రాపర్టీలో 100 శాతం, వైఎస్సా ర్ నివాసమున్న ఇల్లు, ఇంకా కొన్ని ఆస్తులు నా భాగానికి వచ్చాయి’ అని  వివరించారు.

అమరావతి, అక్టోబర్ 25: తన అన్న,  జగన్‌రెడ్డితో ఆస్తి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్సార్ అభిమానులకు ఏపీ సీసీ చీఫ్, వైఎస్సార్ కూతురు షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. ఇందులో అనేక సంచలన విషయాలను వెల్లడించారు. సాక్షి పేపర్, చానెల్‌లో తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇస్తూ కీలక వివరాలను ఆ లేఖలో చెప్పారు.

ఈ సందర్భంగా జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ వైఎస్సార్ అభిమానులకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అమ్మ  విజయమ్మ, నాన్న రాజశేఖర్ రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. రాజశేఖర్ రెడ్డికి లోకం అంతా ఒకెత్తయితే, తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని అని రాశారు.

నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు. నాన్న బతికి ఉన్నన్ని రోజులు ఒకే మాట అనేవారు.. ‘నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం’. వైఎస్సార్  స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారా లు. అవి జగన్ సొంతం కాదు. అన్ని కుటుం బ వ్యాపారాలకు జగన్ ‘గార్డియన్’ మాత్ర మే.

అన్ని వ్యాపారాలను  నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టాలనేది జగ న్ బాధ్యత. ఇది రాజశేఖర్ రెడ్డి మ్యాండేట్. వైఎస్సార్ ఉద్దేశ్యమైన ఇది  మాకు, ఆయన భార్యకు, కేవీపీ రామచంద్రరావు, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి సహా ఆయన సన్నిహితులందరికి స్పష్టంగా తెలుసు’ అని ఆ లేఖలో షర్మిల పేర్కొన్నారు. 

‘నాన్న బతికి ఉన్నంత వరకు  ఏ ఒక్క ఆస్తి పంపకం  జరగలేదు. వైఎస్సార్ హఠాత్తుగా మరణించారు. ఆ తరువాత ఏ ఆస్తి పంపకాలు జరుగలేదు. ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు’ అని పేర్కొన్నారు. 

‘తాతల ఆస్తికి నా పేరు పెట్టినంత మాత్రా న అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు. ఆస్తి పంచడం అంటే ఇవిగో ఈ ఆస్తులు నీకు, ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే’ అని తెలిపారు.

‘కొన్ని ఆస్తులను వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తులు కేసుల వ్యవహారం పూర్తయిన తరువాత బదిలీ చేస్తామని ఒప్పందం జరగడంతో సంతకాలు పెట్టాం’ అని పేర్కొన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్నికల్లో జగన్ ఓడిపోవడంతో సెటిల్ చేసుకుందామని ముందుకు వచ్చారు. అయితే జగన్, భారతి, అవినాష్‌రెడ్డిలకు వ్యతిరేకంగా పబ్లిక్‌గా ఏమీ మాట్లాడవద్దని కండీషన్ పె ట్టారు.

నేను ఒప్పకోకపోవడంతో సెటిల్‌మెంట్ జరగలేదు. దీంతో నా మీద, అమ్మ మీద ఎన్‌సీఎల్‌టీలో మేము మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారు. అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి వస్తుందని గమనించి.. నా బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపుతున్నారు. నిజానికి బెయిల్ రద్దు అయ్యే సీన్ లేదు. షేర్స్ బదిలీకి, బెయిల్ రద్దుకు ఎటువంటి సంబంధం లేను’ అని పేర్కొన్నారు. 

‘ఎన్‌సీఎల్‌టీలో అమ్మ మీద జగన్ వేసిన కేసును మేం ఎక్కడా బయట పెట్టలేదు. కేసు బయటకు రావడానికి జగన్ కారణం అని ఎందుకు అనుకోకూడదు? నేను జగన్‌కు ఒక లెటర్ రాస్తే అది టీడీపీ హ్యాండిల్‌లో పోస్ట్ అయితే నాకేం సంబంధం?  నా వరకు గాని, నా మనుషులు గాని బయటపెట్టలేద ని నేనైతే బైబిల్‌పై ప్రమాణం చేయగలను. చంద్రబాబు చేతిలో బాణం కావాల్సిన అవసరం వైఎస్సార్ బిడ్డకు లేదు.

ఎన్‌సీఎల్‌టీ లో తల్లి మీద కేసు వేసి సొంత అమ్మకే బతు కు మీద అసహ్యం కలిగించి, వైఎస్సార్ అభిమానులకు ఎనలేని మానసిక క్షోభకు గురి చేసింది ఎవరో మీకు తెలుసు. జగన్ ఎవరి కొంగు చాటున ఉండి ఆస్తి, అధికారం కోసం ఇదంతా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు’ అని ఆ లేఖలో షర్మిల వెల్లడించారు.