calender_icon.png 16 November, 2024 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్మోలా.. మజాకా!

16-11-2024 01:40:55 AM

హర్యానా దున్న ఖరీదు రూ.23కోట్లు

ఆహారంలో పావుకిలో బాదం, 20 గుడ్లు

ప్రతినెలా రూ.45వేల వరకు ఖర్చ

వీర్యం ద్వారా నెలకు రూ.5లక్షల ఆదాయం

హర్యానా, నవంబర్ 15: హర్యానాకు చెందిన అన్మోల్ అనే దున్న జీవన శైలిని చూస్తే ఔరా అనక మానరు. దాదాపు 1500 కిలోల బరువుండే ఈ దున్న ఖరీదు ఏకంగా రూ.23కోట్లు. ఈ దున్న ముఖ్యంగా పరిమాణం, వంశపారంపర్యత, సంతానోత్పత్తి సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది.సిర్సాలో ఉంటున్న పల్వీందర్ సింగ్ గిల్ అనే రైతు ఈ అన్మోల్‌ను పెంచుతున్నాడు. దీని వయసు ఎనిమిదేళ్లు. ఉత్తరాదిలో జరిగే పుష్కర్ మే ళా, ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనల్లో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటుంది.

అన్మోల్ రోజూ అధిక క్యా లరీలు కలిగిన ఆహార పదార్థాలు, డ్రైఫ్రూ ట్స్‌ను తింటుందని.. దీని తిండికే రోజూ రూ .1500 ఖర్చు అవుతుందని దాని యాజ మాని చెప్పాడు. అంటే నెలకు రూ.45వేల వరకు ఖర్చవుతుందట. అన్మోల్ రోజూ.. 250 గ్రాముల బాదం, ౪ కిలోల దానిమ్మ లు, 30 అరటి పండ్లు, ౫ లీటర్ల పాలు, 20 గుడ్లను ఆహారంగా తీసుకుంటుంది. ఆయిల్ కేక్, పచ్చి గడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నలను కూడా తింటుంది.

అన్మోల్ దున్నపోతుకు దాని యజమాని పల్వీందర్ సింగ్ గిల్.. రోజూ బాదాం, ఆవ నూనెలతో స్నా నం చేయించడం విశేషం. వారానికి రెండుసార్లు అన్మోల్ నుంచి వీర్యం సేకరిస్తారు. దీనికి పశువుల పెంపకందారుల్లో మంచి డిమాండ్ ఉంది. దీన వీర్యం విక్రయించడం ద్వారా నెలకు రూ.4 నుంచి రూ.5లక్షల ఆదాయం వస్తోంది.