18-03-2025 04:36:07 PM
కలెక్టరేట్ వద్ద పడిపోయిన గోపిక..
హుటాహుటిన ఆర్ బి ఎస్ కే వాహనంలో తరలించిన తోటి ఉద్యోగులు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ లో సోమవారం వైద్య ఆరోగ్యశాఖలోని ఆర్ బిఎస్ కే విభాగం చెందిన వైద్యులకు సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేయగా సమావేశానికి వచ్చిన కాంట్రాక్ట్ ఏఎన్ఎం గోపిక కలెక్టరేట్ ఆవరణ లో ఒక్కసారిగా అపస్మారక స్థితిలో చేరి కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ఇద్దరు మహిళలు గోపిక పిట్స్ వచ్చాయని కాళ్లు, చేతులను రాయడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న ఆర్ బిఎస్ కె వైద్యులు, సిబ్బంది కిందకు దిగి ఆమెను పరిశీలించారు. అపస్మారకస్థితిలో ఉన్న గోపికను వెంటనే వారి వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. దాదాపు అరగంటకు పైగా ఏఎన్ఎం అవస్థ పడడం అక్కడి వారందరినీ కలచివేసింది.