calender_icon.png 6 October, 2024 | 4:22 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

05-10-2024 01:43:34 AM

 శాస్త్రోక్తంగా ధ్వజారోహణం 

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మో త్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం 5:45 గంటల నుంచి 6 గంటల మధ్య మీనాలగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి.

ఈ ఉత్సవాల్లో మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకులు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వ జాన్ని ఎగరేశారు. సకల దేవతలు, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేం దుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశ స్త్యం.

ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదే వి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, హరిహర దేవతలైన శ్రీ అనంతర, గరుడ, చక్రత్తాల్వార్, సేనాధిపతి, ధ్వజపటాన్ని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ వీధులను భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లుల తో తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచిడుండే భక్తుల కోసం సౌకర్యాలు కల్పించారు.

పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు.. 

శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలోని బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం వెండి పళ్లెంలో పట్టు వస్త్రాలు తీసుకొని చంద్రబాబు శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.