హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: భారత యువ టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా ఐటీఎఫ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రేట్ బ్రిటన్ 9ఏ టోర్నీ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అంకిత 6-2 4-6 6-0 అమేలియా (ఇంగ్లండ్)పై విజయం సాధించింది. నేడు జరగనున్న క్వార్టర్స్‌లో మినేజ్ జూతో అంకిత తలపడనుంది. డబుల్స్‌లో సెర్బియా ప్లేయర్ విక్టోరియాతో కలిసి క్వార్టర్స్ చేరిన అంకిత.. అక్కడ పరాజయం పాలై ఇంటిబాట పట్టింది.