వలెన్సియా: భారత టెన్నిస్ యువ క్రీడాకారిణి అంకిత రైనా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుతోంది. ఐటీఎఫ్ డబ్ల్యూ100 వలెన్సి యా 40ఏ టెన్నిస్ టోర్నీలో అంకి త క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్ ప్రిక్వా ర్టర్స్‌లో అంకిత 6 3 6 తో మార్టినేజ్ (స్పెయిన్)ను చిత్తు చేసింది. మ్యాచ్‌లో 41 విన్నర్లతో అంకిత ఆధిపత్యం ప్రదర్శించగా.. 26 విన్నర్లు కొట్టిన మార్టినేజ్ ఐదు డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకుంది. నేడు జరగనున్న క్వార్టర్స్ లో అంకిత స్విట్జర్లాండ్‌కు చెందిన వలెంటినా రైసర్ను ఎదుర్కోనుంది.