calender_icon.png 19 January, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంకిత అదుర్స్

19-01-2025 01:04:31 AM

ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ సొంతం

న్యూఢిల్లీ: భారత టాప్ టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. ఈ ఏడాది సీజన్‌లో తొలి టైటిల్‌ను అంకిత సొంతం చేసుకుంది. ఐటీఎఫ్ వుమె న్స్ 50 ఈవెంట్‌లో డబుల్స్ విభాగంలో బ్రిటన్‌కు చెందిన నైక్తా బియాన్స్‌తో కలిసి అంకిత టైటిల్‌ను సాధించింది.

శనివారం డీఎల్‌టీఏ కాంప్లెక్స్ వేదికగా జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో అంకిత జోడీ 6 3 10 అమెరికాకు చెందిన జెస్సీ ఫలియా జంటను చిత్తు చేసిం ది. అయితే సింగిల్స్‌లో తొలి రౌండ్‌కే పరిమితమైన అంకిత డబుల్స్‌లో మాత్రం చాంపియన్‌గా నిలిచింది.