calender_icon.png 20 April, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకం శివకుమార్ ఎన్నిక

27-03-2025 09:53:14 PM

ఉపాధ్యక్షులుగా గజం అనిల్ కుమార్..

జనరల్ సెక్రటరీగా చేను రవికుమార్ విజయం.. 

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు పరిధిలోని బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం రసవత్తరంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగాయి. ఈ ఎన్నికలలో మొత్తం 46 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకొని పోటీలో నిలిచిన అభ్యర్థులకు మద్దతు పలికారు. అధ్యక్ష పదవి లో పోటీపడిన న్యాయవాది అంకం రవికుమార్ తన ప్రత్యర్థి అభ్యర్థి సింగతి రాజేష్ పై 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. వీరి ఎన్నికల లో రెండు ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఉపాధ్యక్షులుగా పోటీ చేసిన గజం అనిల్ కుమార్ 33 ఓట్లు  సాధించి తన ప్రత్యర్థి దాసారపు రాజు పై గెలుపొందారు.

జనరల్ సెక్రెటరీగా పోటీ చేసిన చేను రవికుమార్ 27 ఓట్లు సాధించి తన ప్రత్యర్థి కనుకుంట్ల రాజేష్ పై 11 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పోటీ చేసిన టి.దేవరాజుకుమార్ కు 27 ఓట్లు, ఎండి .జుబేర్ కు  37 ఓట్లు, అడ్డూరి ప్రతాప్ కు 36 ఓట్లు, బన్న శ్రీనివాస్ కు 29 ఓట్లు వచ్చాయి. ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు నిర్వహించిన ఎన్నికలలో 6 ఓట్లు నోటా కు పడగా,1 ఓటు చెల్లని ఓటుగా గుర్తించారు.  27 ఓట్లు వచ్చిన టి. దేవరాజ్ కుమార్ ఓటమిపాలైనట్లు ప్రకటించారు. న్యాయవాదులు ఉట్ల కుమార్ (ట్రెజరర్),ఎస్. సునీల్ కుమార్ (జాయింట్ సెక్రటరీ), నల్లుల సంగీత (లైబ్రేరియన్) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బార్ సోసియేషన్ ఎలక్షన్ ఆఫీసర్ దాట్ల సతీష్ తెలిపారు.