calender_icon.png 21 February, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండి లాగుతున్నా కదలని అంజి

19-02-2025 12:16:20 AM

నిరుత్సాహంలో కమలం క్యాడర్

కరీంనగర్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్-అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సవాల్ గా తీసుకుని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆ పార్టీ అభ్యర్ధి నరేందర్ రెడ్డికి మద్దతుగా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తుం డగా, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో వెనుకబడి పోతున్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ రాష్ర్ట మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గత నాలుగు రోజులుగా కరీంనగర్ లో మకాంవేసి సోషల్ మీడియా వారియర్స్ తో, నాలుగు జిల్లాల పార్టీ ప్రతినిధులతో సమావేశమై వారిని ఉత్సాహపరుస్తుండగా, అంజిరెడ్డి మాత్రం పట్టభద్రులను ఓట్లు అభ్యర్ధించడంలో ముందుకు సాగడం లేదు.

మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి తన స్వంత ప్రాంతంలోనే ఎక్కువగా పర్యటిస్తూ కరీంన గర్ ఉమ్మడి జిల్లాలో నామమాత్రంగా పర్య టిస్తుండడం, పార్టీ క్యాడర్ కు బాధ్యతలు అప్పగించకపోవడంతో ఉత్సాహంగా ప్రచా రం సాగడం లేదన విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట, జిల్లా స్థాయి నాయ కులను వివిధ ప్రాంతాలకు ఇంచార్జిలుగా నియమించి ప్రచారం నిర్వహిస్తు న్నారు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వచ్చేసరికి బండి సంజయ్ కుమార్ ఒక్కరే పార్టీ అభ్యర్థిని గెలిపించా లన్న సంకల్పంతో సమావే శాలు నిర్వహిస్తుండగా అం జిరెడ్డి బండిస్పీడ్‌ను అందుకో లేక పోతున్నారు. స్వతహాగా వ్యా పారవేత్త అయిన అంజిరెడ్డి కార్పొరేట్ స్థాయిలోనే తన స్వంత టీంను ఏర్పాటు చేసి, సోషల్ మీడియా వారియర్స్‌ను ఏర్పా టు చేసి ప్రచారం నిర్వహిస్తుండ డంతో తమను అభ్యర్ధి పట్టిం చుకోవడం లేదన్న నిరుత్సా హంలో బీజేపీ పార్టీ క్యాడ ర్ ఉంది.

ఉమ్మడి నాలుగు జిల్లాల్లోని పలు జిల్లాల పార్టీ అధ్యక్షులుకు సైతం ఇంత వరకు అంజిరెడ్డి ఫోన్ కాల్ చేయలేదంటే ఆయన ప్రచార శైలి ఏ విధంగా ఉందో అర్ధం చేసు కోవచ్చు. తాను రూపొందించుకున్న టీంనే నమ్ముతూ ముందుకు సాగుతుండడం, పార్టీ టీంను నమ్మలే కపోతుండడంతో పార్టీ సీనియర్లు కూడా తలలు పట్టుకుంటున్నారు.

బీజేపీ పార్టీకి నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో నలుగురు ఎంపీలు ఉన్నారు. ఇందులో బండి సం జయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తు న్నారు. నలుగురు ఎంపీ లు తమ తమ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహి స్తున్నారు. మంగళవారం చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి కరీంనగర్లో ప్రచారం నిర్వహిం చిన సందర్భంలో అభ్యర్థి అంజిరెడ్డి లేకపోవ డం గమనారం.

ఆయన తూతూ మంత్రంగా పర్యటించి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెనుదిరిగారు. పార్టీ క్యాడర్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అంజిరెడ్డి వారి సేవలను వినియోగించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా తన ప్రచార శైలి, వ్యవహారశైలి మారకుంటే పట్టభద్రుల స్థానాన్ని కైవసం చేసుకోవడం కష్టమని సీనియర్లు అంటున్నారు.