calender_icon.png 22 February, 2025 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని గెలిపించాలి

21-02-2025 06:32:56 PM

బిజెపి నాయకులు రోడ్డ మోహన్...

మందమర్రి (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బిజెపి అభ్యర్థి చిన్నమైలు అంజిరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్, బిజెపి జిల్లా నాయకులు రొడ్డ మోహన్ కోరారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో కార్మిక కాలనీలలో శుక్రవారం పట్టభద్రులను కలిసి అంజిరెడ్డిని గెలిపించాలని ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైలు అంజిరెడ్డిని గెలిపించడం ద్వారా పట్టభద్రుల గొంతును శాసనమండలిలో వినిపిస్తారని అన్నారు.

ట్టభద్రుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం, ఉద్యోగాల భర్తీ కోసం అంజిరెడ్డిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టభద్రులను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రామటెంకి దుర్గరాజ్, సప్పిడి నరేష్, బంగారు వేణుగోపాల్, ఠాకూర్ ధన సింగ్, కర్రావుల వినయ్, రమేష్ లు పాల్గొన్నారు.