05-03-2025 12:40:25 AM
కరీంనగర్, మార్చి 4 (విజయక్రాంతి): కరీంనగర్--మెదక్--నిజామా బాద్--ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మె ల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం లో ఉన్నారు. మంగళవారం రాత్రి 10.30 గంటల వరకు ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. మరో ఆరు రౌండ్ల లెక్కింపు అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవుతుం ది.
లెక్కింపు సరళిని చూస్తే మొదటి ప్రాధాన్యతలో ఏ అభ్యర్థికి గెలవని పరిస్థితి నెలకొంది. ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 38,967, కాం గ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డికి 31,644, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణకు 26,562, ఏఐఎఫ్‌బీ అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు 624, స్వతంత్ర అభ్యర్థులు మహ్మద్ ముస్తాక్ అలీకి 999, యాదగిరి శేఖర్‌రావుకు 1,489 ఓట్లు లభించాయి.
ఐదు రౌండ్లు ముగిసేసరికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 7,323 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా, 21 టేబుళ్లలో రౌండ్‌కు 21 వేల ఓట్ల చొప్పున లెక్కింపు ప్రారంభమైంది. చెల్లని ఓట్లు 28,100 కాగా, చెల్లుబాటైన 2,24,000 ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
మొత్తం రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బుధవారం మధ్యా హ్నం కానుంది. మొదటి ప్రాధాన్యత పూర్తయిన తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రతి రౌండ్‌కు రెండు గంటల సమయం పడుతోంది.