ప్రమాదవశాత్తా.. దుండగుల పనా?
జనగామ, నవంబర్ 22 (విజయక్రాంతి): అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఆంజనేయస్వామి విగ్రహం దగ్ధమైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండల కేంద్రంలో జరిగింది. మహదేవ్‌పూర్‌లోని ప్రసిద్ధ అమరేశ్వరస్వామి ఆలయంలోని ఉప దేవాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. గురువారం రాత్రి ఆలయంలో ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా ఆంజనేయస్వామి విగ్రహానికి మంటలు అంటు కున్నాయి.ఈ మంటల్లో విగ్రహం పూర్తిగా దగ్ధమైంది.
విగ్రహం వద్ద వెలిగించిన దీపాలతో అగ్గి రాజుకుందా.. లేదా ఎవరైనా కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. ఘటనా స్థలాన్ని కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, మహదేవ్‌పూర్ సీఐ రాంచందర్‌రావు, ఎస్సై పవన్‌కుమార్ పరిశీలించారు.