04-04-2025 12:00:00 AM
మేడ్చల్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి) బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ద్వారకా నగర్ ఫేస్ 2 లో ఆంజనేయ విగ్రహం ప్రతిష్టాపన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మల్లారెడ్డిని నిర్వాహకులు కాలువ తో సన్మానించారు.