calender_icon.png 27 December, 2024 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమమే మా లక్ష్యం

18-09-2024 10:30:07 AM

- వ్యవసాయ మార్కెట్ యార్డులు దళారులు లేకుండా చేస్తాం 

-కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి సమస్త స్థానం దక్కుతుంది..

-రైతుల సమస్యలు పరిష్కారమే మా ప్రథమ కర్తవ్యం 

-విజయక్రాంతి తో మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ కు ధాన్యం తీసుకువచ్చేందుకు రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించేలా తీర్చిదిద్దామని నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల హటహాసంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న విషయం విధితమే. గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉన్న సందర్భంగా ఆమె విజయ క్రాంతి తో సంభాషించారు.

మార్కెట్ యార్డ్ అంటే మహబూబ్ నగర్ లా ఉండేలా చేస్తాం.. 

మార్కెట్ యార్డ్ అంటే మహబూబ్ నగర్ లా ఉండేలా తీర్చిదిద్దేందుకు కంకణ బద్ధులమై పనిచేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులకు కనీస సౌకర్యాలతో పాటు ఇతర ఏ సమస్యలు ఉన్నాయో పూర్తిస్థాయిలో గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేసేలా అవసరమైన మార్గదర్శకాలను రూపొందించుకొని అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు సాగుతాం మని తెలిపారు. ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. 

సుదీర్ఘ కాలం పాటు నాన్న కాంగ్రెస్ పార్టీలో సేవలు....

మా నాన్న జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా, 12 సంవత్సరాలు డిసిసి అధ్యక్షులుగా, పిసిసి వైస్ ప్రెసిడెంట్ గా, ఏఐసీసీ సభ్యులుగా పనిచేశారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ అంటే మా కుటుంబానికి ఎంతో అభిమానం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని వీడకూడదని దృఢ సంకల్పంతో ఎప్పుడు కూడా ఇతర పార్టీలకు వెళ్లాలని ఆలోచన తమకు రాలేదని, పట్టుదలతో పార్టీ శ్రేయస్సు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత సమయంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ బేకరీ అనితమధుసూదన్ రెడ్డి తెలియజేశారు. 

చినప్పటి నుంచి కాంగ్రెస్ భావజాలాలు...

చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బావ జలలు ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు కూడా ఏ రోజు కూడా పార్టీ శ్రేయస్సు కోరుకున్న మీ తప్ప ఆ పదవి ఈ పదవి కావాలని కోరుకోలేదు. ఎలాంటి లాభపపేక్ష లేకుండా పార్టీ శ్రేయస్సు కోసం పుట్టుక నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని తమకు చేతనైనంత సహాయం చేస్తూ వస్తున్నాం. వాటి పెద్దలు గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ కార్యదర్శిగా, వైస్ ప్రెసిడెంట్ గా, అధికార ప్రతినిధిగా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా, శక్తి ప్రాజెక్టు కోఆర్డినేటర్ గా, ఎంపీ ఎన్నికలలో నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి గాను పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పనిచేశాను. ప్రజల సంక్షేమం కోసం తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా చేసి అందరి మన్ననలు పొందడమే లక్ష్యంగా పనిచేస్తాను.  నాకు ఈ అవకాశం కల్పించిన పార్టీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గురువారం మార్కెట్ యార్డ్ నందు జరిగే ప్రమాణ స్వీకార కార్య క్రమానికి అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.