న్యూఢిల్లీ, జనవరి 12: కెనడా ప్రధాని పదవి నుంచి తాను వైదొలగనున్నట్లు జస్టిడ్ ట్రూడో ప్రకటించిన సంగతి తెలిసిందే. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి సైతం తప్పుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని పదవికి పోటీచేసే తొలి ఐదుగురిలో ఆ దేశ రవాణా శాఖ మంత్రి, భారత సంతతి ఎంపీ అనితా ఇందిరా ఆనంద్ పేరు కూడా ఉన్నారు. కాగా తాజాగా ఆమె ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటనచేశారు. ఓక్విల్లే పార్లమెంట్ ఎంపీగా మరల ఎన్నికవ్వల నుకోవడం లేదని వాపోయారు.