calender_icon.png 3 February, 2025 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాని సినిమాకు మరోసారి అనిరుధ్ స్వరాలు

03-02-2025 01:08:42 AM

స్టార్ హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీలక్ష్మీవేంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఈ కొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ -ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. నాని కూడా తన పాత్ర కోసం సిద్ధం కావడానికి ఇంటెన్స్‌గా జిమ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఆసక్తికర అప్‌డేట్‌ను పంచుకుంది చిత్రబృందం. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యం వహించనున్నారని వెల్లడించింది. ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌లీడర్’ విజయాల తర్వాత నాని, అనిరుధ్ కలిసి పనిచేస్తున్న మూడో చిత్రమిది. వీరిద్ద కాంబోలో వచ్చిన గత రెండు సినిమాలు సంగీత పరంగా విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు ఈ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.

ఈ ప్రాజెక్టులోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నట్టు పేర్కొంటూ అనిరుధ్‌కు హీరో నాని అభినందలు తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ పెట్టారు. మరోవైపు నాని పోస్ట్‌పై అనిరుధ్ సైతం ‘ఇది చాలా ప్రత్యేకం.. వెర్రిగా ముందుకు పోదాం..’ అంటూ స్పందించారు. ఈ సినిమాకు సంబంధించి మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.