calender_icon.png 27 January, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనిరుధ్ రెడ్డి.. జాగ్రత్త

26-01-2025 01:08:36 AM

జడ్చర్ల ఎమ్మెల్యేకు మావోయిస్టు లచ్చన్న దళం పేరిట హెచ్చరిక 

మహబూబ్‌నగర్,  జనవరి 25 (విజయక్రాంతి) : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డినీ హెచ్చరిస్తూ గతంలోని మావోయిస్టులమంటూ సొంత గ్రామం నుంచే కొందరు వ్యక్తులు బెదిరింపు లేఖ ను విడుదల చేసిన విషయం అందరికీ వితమే. ఈ విషయంపై స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం వెన్ను వెంటనే దర్యాప్తు చేసి మావోయిస్టు లేఖ కాదని, తేల్చి తప్పుడు లేక రాసిన వారిని రిమాండ్ పంపిన తెలిసిందే.

ఈ విషయం సద్దుమణిగిన తర్వాత మరో మారు తెల్ల పేపర్ పై లచ్చన్న అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని హెచ్చరిస్తూ ఎమ్మెల్యే ఇంటికి మావోయిస్టు లచ్చన్న దళం మంటూ లేఖను పంపిన విషయం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే గారు మంచిగా ఉండండి.. పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వండి.. ఇష్టం సారంగా వ్యవహరించకండి.. పెద్దవాళ్లకు ఇజ్జత్ ఇవ్వండి... పైసలు ఉన్నాయి కదా అని నిలుగకండి...ఇప్పటికే ఇద్దరు ముస్లింలను, ఒక వ్యక్తిని పట్టుకుపోయినాం ఈ విషయం మరవకు. దయచేసి జాగ్రత్తగా ఉండు... ఇట్లు లచ్చన్న దళం అంటూ లేఖలో తెలియజేశారు. ఈ లేక మావోయిస్టులది కాదని, కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిసింది.