ముంబాయి: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ జాక్ పాట్ కొట్టారు. ఆయన కంపెనీ రిలయెన్స్ పవర్ కు అతి పెద్ద ఆర్డర్ వచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ రివర్స్ వేలం ద్వారా 500 మెగా వాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టు లభించినట్లు రిలయెన్స్ పవర్ ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత రిలయెన్స్ పవర్ షేర్లు పైపైకి ఎగబాకాయి. సోమవారం రిలయెన్స్ పవర్ షేర్లు అప్పర్ సర్క్యూట్ ను తాకాయి. ఆ రోజు షేర్ ధర 30.30 వద్ద ప్రారంభమైంది. ఆర్డర్ అందుకున్న వెంటనే 31.32 రూపాయలకు చేరుకుంది. మంగళవారం కూడా ఇదే జోరు కొనసాగింది. మార్కెట్ ప్రారంభమైన వెనువెంటనే 31.51 కి చేరుకుంది.
ఈ దెబ్బతో ఇన్వెస్టర్లు ఒక్క సారిగా లక్షాధికారులుగా మారిపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీ షేర్లు గత నాలుగున్నర ఏళ్లలో 2671 శాతం రాబడినిచ్చాయి. 2020మార్చి 20న లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఈ రోజు రూ 27.71 లక్షలు సొంతం చేసుకోబోతున్నట్టే. జాక్ పాట్ అంటే ఇదేనని స్టాక్ మార్కెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.