హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: హైదరా బాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) 3 డే లీగ్ చాంపియన్‌షిప్‌లో యువ స్పిన్నర్ అనికేత్ రెడ్డి ఎనిమిది వికెట్లతో సత్తాచాటాడు. ఏ1 డివిజన్ లీగ్‌లో భాగంగా.. ఎవర్‌గ్రీన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ అనికేత్‌రెడ్డి 30 పరుగులు ఇచ్చి 8 వికెట్లు పడగొట్టడంతో బాలాజీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎవర్‌గ్రీన్ కూడా తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌటైన ఎవర్‌గ్రీన్ రెండో ఇన్నింగ్స్‌లో 45/2తో నిలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో యూబీఐపై స్పోర్టింగ్ ఎలెవన్, ఇండియా సిమెంట్స్‌పై బడ్డింగ్ స్టార్, జిందా తిలిస్మాత్‌పై డెక్కన్ వాండరర్స్ విజయాలు సాధించాయి.