calender_icon.png 26 December, 2024 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగబట్టిన పాము

13-07-2024 12:15:08 AM

ఫతేపూర్, జూలై 12 : బహుషా.. భూమిపై ఇంకా నూకలు ఉన్నాయంటే ఇదేనేమో..! నెలరోజుల్లో ఏకంగా ఆరుసార్లు పాముకాటుకు గురైన యువకుడు క్షేమంగా బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కాటేసింది. 40 రోజుల్లో ఏకంగా 7 సార్లు పాము కాటుకు గురైనా బతికి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని ఫతేపూర్‌కు చెందిన వికాస్‌దూబే (24) జూన్ 2 నుంచి జూలై ౧౦ మధ్య ఆరుసార్లు పాముకాటు వేసింది. ఆసుపత్రిలో చేర్చడంతో ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ సందర్భంగా వికాస్ తనకు వచ్చిన కల గురించి తెలిపాడు. ఒకే పాము 8 సార్లు కాటు వేసిందని, చివరిసారి తనను ఎవరూ కాపాడలేరని వివరించాడు. ఎలాంటి చికిత్స అందించినా సరే 9వ సారి పాము కాటు నుంచి తనను ఎవరూ రక్షించలేరని తెలిపాడు.