calender_icon.png 31 October, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీలకు పదోన్నతులు కల్పించాలి

04-07-2024 12:44:04 AM

మంత్రి సీతక్కకు టీఎన్జీవో వినతి

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): అంగన్వాడీ ఉద్యోగులకు 45 ఏండ్లు నిబంధనను తొలగించి, వయస్సుతో సంబంధం లేకుండా పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని టీఎన్జీవో, టీజీవో నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధానకార్యదర్శులు ముజీబ్, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ బుధవారం పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు.