calender_icon.png 26 October, 2024 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళాత్మక కేంద్రాలుగా అంగన్వాడీలు..

26-10-2024 11:43:38 AM

బెల్లంపల్లి 11వ వార్డులో బొమ్మల పెయింటింగ్ లతో తీర్చిదిద్దబడిన అంగన్వాడి కేంద్రం 

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు కళావిహీనంగా కనిపించిన అంగన్వాడీ కేంద్రాలు ఇకపై అందానికే అందం తెచ్చి పెట్టబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో, స్థానిక శాసనసభ్యులు గడ్డం వినోద్ సహకారంతో అంగన్వాడీ కేంద్రాలు కొత్త రూపు దిద్దుకుంటున్నాయి. బెల్లంపల్లి పట్టణంలోని 18 అంగన్వాడీ కేంద్రాలకు రూ.6,48000 మంజూరయ్యాయి. ఈ నిధులతో కేంద్రాలలో చిన్నారులు ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా ఆడుకునే విధంగా ఆకట్టుకునే రంగురంగుల పెయింటింగ్ లతో కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు.