19-03-2025 12:37:26 AM
నాగర్ కర్నూల్ మార్చి 18 విజయక్రాంతి :తెలంగాణ ప్రజా ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లాలోని అంగన్వాడీ, ఆయాలు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వారికి మద్దతుగా సిఐటియు నాయకులు ఆంజనేయులు పా ల్గొని మాట్లాడారు. అంగన్వాడీలకు 18వేలు వేతనం, కనీస సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు కానీ హామీ నెరవేరలేదన్నారు.
నూతన జాతీయ విద్యా విధానం పేరుతో అంగన్వాడి వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని దీనివల్ల మాత శిశు మరణాలు పెరిగే ప్రమాదం ఉన్నదన్నారు. అంగన్వాడి సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్లో నిధులు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని లేదంటే ప్రస్తుతం చేపడుతున్న సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, పర్వతాలు, రామయ్య, అశోక్, తారా సింగ్, గీత, మధు, అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, ప్రభావతి, రజియా, సుచిత్ర, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.