calender_icon.png 19 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి కార్యకర్తల ఆందోళన..

18-03-2025 08:56:57 PM

48 గంటల పాటు నిర్వహించిన ఆందోళన..

ఆందోళనలో చోటుచేసుకున్న వాగ్వాదం..

కామారెడ్డి (విజయక్రాంతి): అంగన్వాడి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని 48 గంటల ఆందోళన కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. స్వయంగా కలెక్టర్ ఆందోళన కార్యక్రమం వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకోవాలని కోరారు.

తమ సమస్యలు వివరిస్తామని పట్టుబట్టడంతో అసిస్టెంట్ కలెక్టర్ విక్టర్ స్వయంగా కార్యకర్తల దగ్గరికి వచ్చి సమస్యలు విన్న ఆయన జిల్లా పరిధిలో మా పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మిగతా సమస్యలు మిగతా డిమాండ్లన్నింటినీ ప్రభుత్వానికి తెలియజెసి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు కల్పన, బాబాయ్ సిఐటియు నాయకులు రాజనర్సు, లక్ష్మి, ఎస్ఎఫ్ఐ నాయకులు అరుణ్, అజయ్ 1000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.