అంగన్వాడీ కార్యకర్త దారుణ హత్య
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లా బాసగూడ ప్రాంతంలో అంగన్‌వాడీ వర్కర్‌ని కొడుకు కళ్ల ముందే గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య తర్వాత ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో రాత్రి 8 నుండి 9 గంటల మధ్య కొందరు గుర్తు తెలియని దుండగులు అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మీపాదమ్మను పదునైన ఆయుధంతో దారుణంగా హత్య చేశారు. రక్షించేందుకు వచ్చిన కొడుకుతో దుండగులు గొడవపడి లక్ష్మిని హత్య చేశారు. లక్ష్మీపాదంపై గతంలో రెండుసార్లు బెదిరింపులు వచ్చాయి. దాడి చేసిన వ్యక్తులు సీఆర్పీఎఫ్ క్యాంపు ఒక కిలోమీటరు దూరంలో నేరానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.